ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్​తో మహిళ మృతి...ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన - విశాఖపట్నం నేర వార్తలు

విశాఖలోని ఓమ్ని ఆర్కే ఆస్పత్రి ఎదుటు ఓ మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. సరైన వైద్యం అందించకపోవటంతో ఆమె మృతి చెందిందని వారు ఆరోపించారు.

ఆస్పత్రి ముందు ఆందోళన చేస్తున్న రోగి తరపు బంధువులు
ఆస్పత్రి ముందు ఆందోళన చేస్తున్న రోగి తరపు బంధువులు

By

Published : May 3, 2021, 11:18 AM IST

అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి సరైన వైద్యం అందించలేదంటూ విశాఖలో ఓమ్ని ఆర్కే ఆస్పత్రి ఎదుట రోగి బందువులు ఆందోళనకు దిగారు. ఆరిలోవ చినగదిలి ప్రాంతానికి చెందిన ఇందిరా అనే మహిళ కరోనా సోకటంతో గత నెల 5వ తేదీన ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి రోగికి ఆస్పత్రిలో సరైన వైద్య సేవలు అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతో బాధితురాలు తల్లి స్వయంగా వెళ్లి సపర్యలు చేయాల్సి వచ్చిందని వారు వాపోయారు. తీరా ఇవాళ రోగి చనిపోయిందని.. బిల్లు 11 లక్షలు కట్టాలని ఆస్పత్రి యాజమాన్యం ఒత్తిడి తీసుకువచ్చారని రోగి బంధువులు ఆరోపించారు. మొత్తం బిల్లు కడితేనే మృతదేహాన్ని దహన సంస్కారాలకు అప్పగిస్తామని ఆస్పత్రి వర్గాలు తేల్చిచెప్పడంతో రోగి బందువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ఎదుట నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి:

పాడేరులో కొవిడ్​తో చనిపోయింది.. పవన్ కల్యాణ్ బౌన్సరే!

పిడుగుపాటుతో ఇద్దరు మృతి- సీఎం దిగ్భ్రాంతి

ABOUT THE AUTHOR

...view details