ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్రలేఖనం పోటీల్లో.. కొత్తపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థిని ప్రతిభ - పూలే విద్య అభివృద్ధి పరిశోధన కేంద్రం ఆన్​లైన్​ పోటీలు వార్తలు

పూలే విద్య అభివృద్ధి పరిశోధన కేంద్రం ఆన్​లైన్​లో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో.. కొత్తపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థిని ప్రతిభ చూపింది. పర్యావరణ పరిరక్షణపై వేసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంది. ప్రతిభ కనబరిచిన విద్యార్ధిని సౌమ్య శ్రీ లక్ష్మీని ఉపాధ్యాయులు అభినందించారు.

teachers appreciate to sowmya sri laxmi
సౌమ్యశ్రీ లక్ష్మీని అభినందిస్తున్న ఉపాధ్యాయులు

By

Published : Mar 31, 2021, 6:19 PM IST

జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీలో విశాఖ జిల్లా కసింకోట మండలం కొత్తపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థిని ప్రతిభ కనబరిచింది. పూలే విద్య అభివృద్ధి పరిశోధన కేంద్రం ఆన్​లైన్​లో నిర్వహించిన పోటీల్లో.. పర్యావరణ పరిరక్షణపై.. వేసిన చిత్రం బంగారు పతకంతో పాటు.. నేషనల్ ఆర్ట్ ఎక్సలెన్సీ అవార్డు గెలుపొందింది. ప్రతిభ చూపిన విద్యార్థిని సౌమ్య శ్రీ లక్ష్మీని.. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మాకర్, ఉపాధ్యాయులు అభినందించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details