విశాఖలోని పద్మనాభం స్వామి ఆలయంలో... కోటి దీపోత్సవం జరిగింది. ఏటా కార్తీక బహుళ అమావాస్య సూర్యాస్తమయం తర్వాత... అనంతుని 1285 కొండ మెట్లకు దీపాలంకరణ చేయడం ఆనవాయితీగా వస్తుంది. 36 ఏళ్ల నుంచి నేటివరకు కోటి దీపోత్సవం సింహాచల దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతోపాటు రాయగడ, విజయవాడ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్తీకమాసంలో దీపారాధన చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
పద్మనాభస్వామి ఆలయంలో ఘనంగా కోటి దీపోత్సవం - koti deepostavam at vishakapatnam latest news
విశాఖలోని పద్మనాభస్వామి ఆలయంలో కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
విశాఖ పద్మనాభస్వామి ఆలయంలో ఘనంగా కోటి దీపోత్సవం