ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోరుట్లలో ఏటీఎం చోరీ.. పసిగట్టిన కమాండ్ కంట్రోల్​.. ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

ATM Theft in Korutla : ఓ వైపు ప్రజలంతా సంక్రాంతి వేడుకల్లో బిజీగా ఉంటే.. ఇదే అదనుగా భావించిన కొందరు దుండగులు ఏటీఎంలో నగదు చోరీకి ప్రయత్నించారు. ఎవరూలేని సమయంలో ఏటీఎంలో నుంచి డబ్బు దొంగిలించి పారిపోయేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసులు ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో చోటుచేసుకుంది.

ATM Theft in Korutla
కోరుట్లలో ఏటీఎం చోరీ

By

Published : Jan 15, 2023, 11:24 AM IST

కోరుట్లలో ఏటీఎం చోరీకి యత్నం.. ఛేజ్​ చేసి పట్టుకున్న పోలీసులు

ATM Theft in Korutla : తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో పండుగ పూట కొందరు దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. వేములవాడ రోడ్డులోని ఎస్​బీఐ ఏటీఎంలో నగదు చోరీ చేసి అనంతరం కారులో పారిపోవడానికి ప్రయత్నించారు. ఇదంతా ఓ కంట కనిపెడుతున్న హైదరాబాదులోని ప్రధాన కార్యాలయం.. సిగ్నల్ రావడంతో వెంటనే కోరుట్ల పోలీసులను అలర్ట్ చేసింది. పెట్రోలింగ్ పోలీసులు సకాలంలో స్పందించి వెంటనే ఏటీఎం వద్దకు చేరుకున్నారు. అప్పుడే చోరీ చేసిన నగదుతో కారులో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న దొంగల వాహనానికి అడ్డంగా వెళ్లారు. పోలీసులు తమ వాహనంతో దొంగల కారును ఢీకొట్టారు. ఒక్కసారిగా ఢీ కొట్టడంతో కారులో నుంచి డబ్బంతా రోడ్డుపై చిందరవందరగా పడిపోయింది. ఈ క్రమంలో దొంగలు పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి పరారయ్యారు.

రోడ్డుపై పడిన డబ్బును పోలీసులు సేకరించారు. దాదాపు రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు ఏటీఎంలో చొరబడటం.. నగదు చోరీ చేయడం.. ఆ తర్వాత కారులో వెళ్లడం.. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ప్రస్తుతం పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా పరారీలో ఉన్న దొంగల కోసం గాలిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details