కొండను ఢీకొన్న లారీ.. వాహనరాకపోకలకు అంతరాయం..
విశాఖ మన్యం జి.మాడుగుల-పాడేరు రహదారిలో అదుపుతప్పిన లారీ కొండను ఢీ కొట్టింది.మత్స్య పురం బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.దీంతో లారీ రోడ్డుగా నిలచిపోవడంతో..ఆ రహదారిలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.సుమారు గంటపాటు వాహనాలు రెండువైపుల నిలిచిపోయాయి.