తెదేపా ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం: కొణతాల - కొణతాల రామకృష్ణ ఎన్నికల ప్రచారం
విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ. ఎన్నికల్లో మరోసారి తెదేపాను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన.. తెదేపా ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలుస్తున్నారని కొణతాల చెప్పారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం వెంకటాపురం గ్రామ ప్రజలు, నేతలతో సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెదేపా విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.