ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పడవ బోల్తాపడి గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం - visakhapatnam district latest news

విశాఖపట్నం జిల్లా కోనాం జలాశయంలో నాటుపడవ బోల్తాపడి గల్లంతైన వ్యక్తి మృతి చెందాడు. మూడు రోజుల గాలింపు చర్యల అనంతరం గురువారం మృతదేహం లభించింది.

konam reservoir missing person found in visakhapatnam district
కోనాం జలాశయంలో మృతదేహం లభ్యం

By

Published : Jul 16, 2020, 7:23 PM IST

విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం కోనాం జలాశయంలో నాటుపడవ బోల్తాపడి గల్లంతైన వ్యక్తి సింగం కళ్యాణం (49) మృతి చెందాడు. గల్లంతైన అతని మృతదేహం గురువారం లభ్యమైంది. మూడు రోజులుగా స్థానికులు నాటు పడవలపై చేపల వలలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

సింగం మృతదేహం లభ్యమైందని అధికారులు తెలిపారు. అతడికి ముగ్గరు పిల్లలు ఉన్నట్టు తెలిపారు. ఘటనపై ఎస్సై సురేష్​ కుమార్​ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details