ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిండుగా కోనాం.. బొడ్డేరు నదిలోకి వరదనీటి విడుదల - vishakapatnam konam news today

విశాఖ జిల్లా కోనాం మధ్య తరహా జలాశయంలోకి వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ నుంచి వరద నీరు చేరడంతో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. అప్రమత్తమైన అధికారులు జలాశయం గేట్లు ఎత్తి బొడ్డేరు నదిలోకి వరద నీటిని విడుదల చేస్తున్నారు.

నిండుగా కోనాం.. బొడ్డేరు నదిలోకి వరదనీటి విడుదల
నిండుగా కోనాం.. బొడ్డేరు నదిలోకి వరదనీటి విడుదల

By

Published : Oct 4, 2020, 8:54 PM IST

విశాఖ జిల్లా కోనాం మధ్య తరహా జలాశయంలోకి వరద నీరు పోటెత్తుతోంది. అప్రమత్తమైన అధికారులు జలాశయం గేట్లు ఎత్తి బొడ్డేరు నదిలోకి వరద నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రమాద స్థాయికి..

చీడికాడ మండలం కోనాం మధ్యతరహా జలాశయం నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. ఎగువ ప్రాంతం నుంచి జలాశయంలోకి 340 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా, ప్రస్తుతం 100.40 మీటర్లకు చేరుకుంది.

ఎవరూ నదిలో దిగొద్దు..

అప్రమత్తమైన అధికారులు జలాశయం నుంచి 250 క్యూసెక్కుల వరద నీటిని బొడ్డేరు నదిలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎగువ, దిగువ కాల్వకు 90 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వరద నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో బొడ్డేరు నదిలోకి ఎవరూ దిగొద్దని జలాశయం అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

ఇవీ చూడండి:

'నదీ జలాల వివాదాలపై ముఖ్యమంత్రులు చర్చించుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details