సంక్రాంతి సంబరాల్లో భాగంగా సాగరతీరంలో పతంగులు పైపైకి ఎగిరి ఆనందాన్ని పంచాయి. సంక్రాంతి వేళ.. ఇతర ప్రాంతాలవారు స్వస్ధలాలకు తరలిపోగా.. నగరవాసులు మాత్రం బీచ్ రోడ్డులో గాలిపటాలను ఎగరేస్తూ పండుగ చేసుకున్నారు. సాగరతీరానికి చేరుకొని అనేక వర్ణాల్లోని గాలిపటాలు ఎగరేస్తూ ఆహ్లాదాన్ని పంచారు. గద్ద, చెవులపల్లి రూపాల్లోని భారీ గాలిపటాలు సముద్రపుటలలపై ఎగురుతున్నట్టుగా కనిపిస్తూ సందర్శకులకు వినోదాన్ని అందించాయి.
సాగర తీరంలో పతంగుల పండుగ - kites flying at visakha beach road latest news update
విశాఖ సాగరతీరంలో వివిధ వర్ణాల్లోని పతంగులు (గాలిపటాలు) ఆహ్లాదాన్ని అందించాయి. నగరవాసులు బీచ్ రోడ్డులో గాలిపటాలను ఎగరేస్తూ సంక్రాంతి పండుగ చేసుకున్నారు.
సాగర తీరంలో పతంగుల పండుగ