రైలు ప్రయాణంలో అరకులోయ అందాలను తిలకించాలని భావించే పర్యాటకులకు రైల్వేశాఖ తీపి కబురు అందించింది. విశాఖపట్నం-కిరండోల్ ప్రత్యేక రైలును ఈ నెల 15 నుంచి నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కరోనా తీవ్రత తగ్గిన అనంతరం ఇటీవలే ప్రారంభమైన ఈ రైలును రద్దీ లేని కారణంగా అధికారులు రద్దు చేశారు.
ప్రస్తుతం అరకులోయకు వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఈనెల 15 నుంచి విశాఖపట్నం-కిరండోల్ (08516), 16 నుంచి కిరండోల్-విశాఖపట్నం (08515) ప్రత్యేక రైళ్లను తిరిగి పట్టాలెక్కిస్తున్నట్లు తూర్పుకోస్తా రైల్వే అధికారులు పేర్కొన్నారు.