విశాఖ జిల్లా భీమిలి మండలం అమనాం గ్రామానికి చెందిన ఉమకు.. మేనమామ రాముతో 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. భర్త సంపాదన అంతంతమాత్రమే కావటంతో కుటుంబ పోషణ కోసం అప్పటినుంచి టైలరింగ్ చేస్తోంది. గర్భిణిగా ఉన్న సమయంలో పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్తే తెలిసింది ఆమెకు పుట్టుకతోనే ఒక కిడ్నీ లేదని. ఉన్న ఒకటీ ఉండాల్సిన దానికన్నా తక్కువ సైజులో ఉందని. ఇక ఆమె కుట్టుపని చేయకూడదని వైద్యులు సూచించారు.
అప్పుడు తెలిసింది
ఆ విషయం తెలిసి ఒక్క క్షణం నివ్వెరపోయినా తర్వాత తేరుకుంది. వైద్యులు చెప్పినట్లు టైలరింగ్ మానేయలేదు. ఎందుకంటే ఆమె బట్టలు కుడితేనే కుటంబం నడుస్తుంది. కిడ్నీ వ్యాధి వలన ఓ పక్క నడుము నొప్పి, కాళ్ల వాపులు వేధిస్తున్నా పనిచేయక తప్పడం లేదు ఆ మహిళకు. డయాలసిస్ చేయించుకనేంత ఆర్థిక స్తోమత లేక హోమియో మందులతో కాలం నెట్టుకొస్తోంది.
ఆదుకోండి