ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని మావోయిస్టు కీలక నేత... ప్రత్యేక జోనల్ కమిటీ పరిధిలో ఏఓబీ మిలటరీ ప్లాటున్ సభ్యుడిగా ఉన్న సాంబ కోర అలియాస్ రణదేవ్ అలియాస్ దేవో... ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయారు. ఇతనితోపాటు కట్ఆఫ్ ఏరియాకు చెందిన ఏడుగురు మిలీషియా సభ్యులు కూడా లొంగిపోయారు. లివిటిపుట్టులోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ హత్య కేసుతోపాటు 12 ఘటనలతో ఈయనకు సంబంధం ఉంది.
కిడారి, సోమ హత్య కేసు... కీలక నిందితుడు లొంగుబాటు - మావోయిస్టు రణదేవ్ లొంగుబాటు
అరకులో ఇద్దరి రాజకీయనాకుల హత్య కేసులో ప్రధాన నిందితుడు..12 కేసులతో సంబంధం ఉన్న మావోయిస్టు నేత రణదేవ్ ఒడిశాలోని మల్కన్‌గిరి పోలీసులకు లొంగిపోయాడు. మావోయిస్టుల పట్ల గిరిజనులకు నమ్మకం లేకపోవటం, పోలీసుల కూబింగ్ వల్ల తాను లొంగిపోతున్నట్లు రణదేవ్ తెలిపాడు.
Kidari and Soma murder accused maoist ranadev surrender at malkangiri in andra and odisha border
2017లో మావోయిస్టు పార్టీలో సభ్యునిగా చేరి... పెద్దబయలు ఏరియా కమిటీలో పనిచేశారు. అనంతరం ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ పరిధిలో ఉండే మిలటరీ ప్లాటూన్ సభ్యునిగా ఉన్నారు. దేవోపై ఒడిశా ప్రభుత్వం రెండు లక్షల రివార్డును ప్రకటించింది. ఇటీవల కాలంలో పోలీసులు కూంబింగ్ ఎక్కువ కావడం... ఏఓబీ జంటురాయిలో జరిగిన ఘటనతో మావోయిస్టుల పట్ల గిరిజనులకు ఎటువంటి నమ్మకం లేదని తెలిసిందని.. అందుకే తాను లొంగిపోతున్నాని ఎస్పీకి రణదేవ్ తెలిపారు.
ఇదీ చదవండి:ఏవోబీలో ఇంటింటా పోలీసుల తనిఖీ
Last Updated : Mar 19, 2020, 1:47 PM IST