ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఖుర్దా రోడ్-అహ్మదాబాద్ మధ్య ప్రత్యేక రైలు - viskha news

ఈ నెల 30 నుంచి ఖుర్దా రోడ్-అహ్మదాబాద్ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఏ.కె. త్రిపాఠి తెలిపారు.

Khurda Road- Ahmedabad special train in every wednesday
ఖుర్దా రోడ్- అహ్మదాబాద్ మధ్య ప్రత్యేక రైలు

By

Published : Sep 26, 2020, 11:39 AM IST

ఖుర్దా రోడ్- అహ్మదాబాద్ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏ.కె. త్రిపాఠి తెలిపారు. ఖుర్దా రోడ్-అహ్మదాబాద్ (08407) ప్రత్యేక వారాంతపు ఎక్స్ ప్రెస్ రైలు ఈ నెల 30 నుంచి అక్టోబర్ 21 వరకు ప్రతి బుధవారం ఖుర్దా రోడ్​లో బయలు దేరనున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(08408) అక్టోబర్ 3 నుంచి 24 వరకు ప్రతి శనివారం అహ్మదాబాద్​లో బయలుదేరుతుందన్నారు.

ఆగే స్టేషన్లు..

బ్రహ్మపూర్, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, వరంగల్, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, చంద్రపూర్, వార్ధా, బద్నేరా, భూసాబల్, జల్గావ్, నందూర్బార్, సూరత్, భార్చ్ రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.

ఇదీ చదవండి:నేటి నుంచే భారత్, జపాన్​ల మధ్య 'జిమెక్స్' నావికా విన్యాసాలు

ABOUT THE AUTHOR

...view details