విశాఖజిల్లా మాడుగుల పెద్దేరు జలాశయం నుంచి సాగునీటి విడుదలతో ఆయకట్టు ప్రాంతంలో ఖరీఫ్ వరి నాట్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో జలాశయం నిండటంతో ,ఆయకట్టు ప్రాంతంలో ఖరీఫ్ వరినాట్ల కోసం 80క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో 19 వేల ఎకరాల్లో వరినాట్లు ఉత్సాహంగా ప్రారంభం అయ్యాయి. నీటి విడుదలపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టు లో వరినాట్లు పూర్తయ్యేంత వరకు నీటిని విడుదల చేస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.
ఉత్సాహంగా కొనసాగుతున్న వరినాట్లు - peddaru
విశాఖ జిల్లా పెద్దేరు జలాశయం నుండి సాగునీరు విడుదల కావడంతో, రైతాంగం ఖరీఫ్ పంటకు సిద్దమవుతోంది. దిగవ పంటపొలాల్లో వరినాట్ల పనులతో రైతులు ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

వరినాట్లు నాటుతున్న రైతులు
వరినాట్లు నాటుతున్న రైతులు
ఇదీ చూడండి:సెప్టెంబర్ 5 నుంచి గిగాఫైబర్ సేవలు