విశాఖ గ్యాస్ లీక్ ఘటన తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంపై ప్రజల్లో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మొత్తం 210 పరిశ్రమలున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో పారిశ్రామికవాడలు విస్తరించి ఉన్నాయి.అయితే ఆయా పరిశ్రమలు నిబంధనల మేరకు మాత్రమే వాయు ఉద్గారాలు విడుదల చేస్తున్నాయని కాలుష్య నియంత్రణ మండలి చెబుతోంది.
ఉభయ జిల్లాల్లో వెలువడే వాయువులివీ..
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గ్రానైట్, బొగ్గు, కాగితం, విద్యుత్తు, భారజల కేంద్రం తదితర పరిశ్రమలు ఉన్నాయి. వీటి నుంచి ప్రధానంగా నాలుగు రకాల వాయువులు వెలువడతాయని అధికారికంగానే వెల్లడిస్తున్నారు. అయితే అవి తగిన మోతాదులోనే ఉద్గారాలు విడుదల చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
- - హైడ్రోజన్ సల్ఫైడ్
- - కార్బన్ మోనాక్సైడ్
- - కార్బన్ డై ఆక్సైడ్
- - నైట్రిక్ ఆక్సైడ్