ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 28, 2020, 3:00 PM IST

ETV Bharat / state

కేజీహెచ్​లో కరోనా కలకలం... మూతపడ్డ ఓ వార్డు

విశాఖ నగరంలో కరోనా కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. గుండె సంబంధిత సమస్యతో కేజీహెచ్​లో చికిత్స పొందుతున్న ఓ మహిళకు కరోనా సోకినట్టుగా పరీక్షల్లో తేలింది. ఆమెకు చికిత్స అందించిన ప్రొఫెసర్​తో సహా పది మంది వైద్యులు, ఇతర సిబ్బందికి కరోనా పరీక్షలు చేసి.. క్వారంటైన్​కు పంపారు. మహిళకు చికిత్స జరిగిన రాజేంద్ర ప్రసాద్ వార్డును మూడు రోజుల పాటు మూసివేశారు.

కేజీహెచ్​లో కరోనా కలకలం... మూతపడ్డ ఓ వార్డు
కేజీహెచ్​లో కరోనా కలకలం... మూతపడ్డ ఓ వార్డు

విశాఖలో కొవిడ్ కేసుల సంఖ్య వందకు చేరుకుంది. బుధవారం ఒక్కరోజే కొత్తగా పది కేసులు నమోదయ్యాయి. గురువారం కూడా మరికొన్ని కేసులు నిర్ధరణ కావడం వల్ల అధికార్లు మరింత అప్రమత్తం అయ్యారు. కింగ్ జార్జి ఆసుపత్రిలో హృద్రోగ సంబంధ సమస్యతో ఇన్ పేషెంట్​గా చేరిన మహిళకు కరోనా సోకడంపై.. ఆ విభాగంలో ఆందోళన నెలకొంది.

మహిళకు చికిత్స చేసిన ప్రొఫెసర్, పది మంది వైద్యులు, మిగిలిన సిబ్బంది మొత్తం 40 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా వీరిని క్వారంటైన్​లో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. మహిళకు చికిత్స చేసిన కేజీహెచ్​లోని రాజేంద్రప్రసాద్ వార్డును పూర్తిగా శానిటైజ్ చేసి, మూడు రోజుల వరకు మూసేస్తున్నట్టు సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున వెల్లడించారు.

ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే వారు ముందుగా కొవిడ్ పరీక్షలు చేయించుకుంటే.. ఇటువంటి ఘటనలు నివారించవచ్చని వైద్య వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి:

ఎన్టీఆర్ కలలను చంద్రబాబు సాకారం చేస్తున్నారు: బాలకృష్ణ

ABOUT THE AUTHOR

...view details