ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Suicide attempt: కేజీహెచ్‌ మేడ పైనుంచి దూకబోయిన కరోనా బాధితురాలు.. కాపాడిన సిబ్బంది - విశాఖ కరోనా బాధితురాలి ఆత్మహత్యాయత్నం వార్తలు

కరోనా బాధితురాలు విశాఖ కేజీహెచ్ మేడ పైనుంచి దూకబోయింది. తక్షణమే గమనించిన సిబ్బంది ఆమెను కాపాడారు. తనను ఇంటికి పంపించాలని బాధితురాలు వైద్యులను కోరగా.. ఆమె కోలుకోకపోవటంతో వైద్యులు సర్దిచెప్పారు. చికిత్స పొందుతున్న గది కిటికీ వద్దకు వెళ్లి దూకబోయింది. ఇప్పటికే ఈ బ్లాక్‌లో మేడ పైనుంచి దూకి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.

ggh corona patient suicide attempt
ggh corona patient suicide attempt

By

Published : Jun 4, 2021, 5:29 PM IST

కేజీహెచ్‌ మేడ పైనుంచి దూకబోయిన కరోనా బాధితురాలు

విశాఖ కేజీహెచ్​లో సీఎస్​ఆర్ బ్లాక్ పైనుంచి దూకబోయిన కొవిడ్ బాధితురాలిని..వైద్య సిబ్బంది రక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించటాన్ని గమనించిన సిబ్బంది.. తక్షణమే స్పందించి కాపాడారు. కొద్దిరోజులుగా ఆమె కుటుంబానికి దూరంగా ఉండటంతో...ఇంటికి తరలించాలని వైద్యులను కోరింది. ఆమె కోలుకోకపోవటంతో వైద్యులు సర్ది చెప్పారు. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతున్న గది కిటికీ వద్దకు వెళ్లి దూకేందుకు సిద్ధపడింది. సమీపంలో ఉన్న మరో కొవిడ్ బాధితుడు గమనించి కేకలు వేయడంతో అప్రమత్తమైన సిబ్బంది.. ఆమెను అడ్డుకున్నారు.

ఇప్పటికే ఈ బ్లాక్‌లో నలుగురు బాధితులు మేడ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది వెల్లడి చేయలేదు. సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో విషయం తెలిసింది.

ఇదీ చదవండి: 'కాళీపట్నం రామారావు మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు'

ABOUT THE AUTHOR

...view details