ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిని సందర్శించిన  కాయకల్ప  బృందం - రాష్ట్ర ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్

నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిని రాష్ట్ర స్థాయి కాయకల్ప అవార్డుల ఎంపిక బృందం సందర్శించింది. వార్డుల్లో తిరిగి.. రోగులకు అందుతున్న సౌకర్యాలు ఇతర వసతుల గురించి తెలుసుకుంది.

kaya kalpa Awards Selection Team visits Narsipatnam Hospital
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి కాయకల్ప అవార్డుల బృందం

By

Published : Feb 13, 2021, 5:28 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిని రాష్ట్ర స్థాయి కాయకల్ప అవార్డుల ఎంపిక బృందం సందర్శించింది. ఆస్పత్రిని అన్ని కోణాల్లో పరిశీలించారు. ఇప్పటికే ఈ ఆస్పత్రి.. పలు విభాగాల్లో పురస్కారాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఆస్పత్రిలో ప్రసవాల శాతం, పరిశుభ్రత, రోగులకు కల్పించే సదుపాయాలు, వసతులు, తదితర అంశాలకు సంబంధించి వార్డుల్లోని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి తుది నివేదికను జాతీయ కాయకల్ప అవార్డు బృందానికి పంపనున్నట్లు పేర్కొంది.

ఈ కార్యక్రమంలో.. రాష్ట్ర ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎల్​బీఎస్​హెచ్ దేవి, కాయకల్ప అవార్డు రాష్ట్ర కన్సల్టెంట్ డాక్టర్ రవికుమార్​ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:విపక్షాలపై తిరస్కరణాస్త్రం

ABOUT THE AUTHOR

...view details