కార్తీక మాసం మొదటి సోమవారం విశాఖ జిల్లా ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఉదయం నుంచి భక్తులు శివార్చనలో తరించారు. చాలా మంది ఉపవాస దీక్ష చేస్తూ దేవాలయాలలో పూజలు చేశారు.
నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. రోలుగుంట లోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో భక్తులు బారులు తీరారు. అనకాపల్లిలోని సిద్దలింగేశ్వర, భోగ లింగేశ్వర, ఉమా రామలింగేశ్వర, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.