విశాఖ జిల్లాలో...
విశాఖ జిల్లాలో నర్సీపట్నం ఉత్తర వాహిని నదీ తీరంలో.. సత్యనారాయణ స్వామికి పూజలు, వ్రతాలు నిర్వహించారు. ప్రత్యేక కదంబ కార్యక్రమం నిర్వహించారు. భక్తి గీతాలు ఆలపించారు. మరోవైపు.. మాజీ ఉప కులపతి ముత్యాలనాయుడు.. కార్తీక మాసం సందర్బంగా భక్తులకు రామాయణం పుస్తకాలు అందించారు. ప్రతి దేవాలయంలో ఈ పుస్తకం ఉండాలని ఆకాంక్షించారు.
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల కోసం.. రాట ఉత్సవం నిర్వహించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఈవో మాధవి పాల్గొన్నారు. డిసెంబర్ 15 నుంచి మార్గశిర మాసోత్సవాలు ఆరంభం కానున్నాయి.
చిత్తూరు జిల్లాలో..
అలిపిరి శ్రీ లక్ష్మీ నారాయణస్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు బాలాలయ జీర్ణోద్ధరణ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. చివరి రోజు పూర్ణాహుతితో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ముగిసింది.
తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో గంగ పూజ ఘనంగా జరిగింది. అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో గంగమ్మకు పుసుపు కుంకుమ సమర్పించి...గంగా హారతి ఇచ్చారు.
తంబళ్లపల్లెలో ప్రజలు భక్తి శ్రద్ధలతో కార్తీక ఉత్సవాలను నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తంబళ్లపల్లె మల్లయ్య కొండ మల్లికార్జున స్వామి ఆలయం, సాలి వీధి శివాలయం, కోసు వారి పల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవాలయం, బీ.కొత్తకోట కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చదవండి:
తీరం దాటిన 'నివర్'... తీర ప్రాంతంలో అప్రమత్తం