విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళిగా తూర్పు నౌకాదళం భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా...అమరులైన సైనికుల త్యాగాలు ఎప్పుడూ స్మరించుకోవడం గర్వంగా ఉంటుందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆర్కే బీచ్ నుంచి ప్రారంభమైన వాకథాన్... పార్క్ హోటల్ కూడలి వరకు చేరుకుని తిరిగి కాళీమాత ఆలయం వద్దకు చేరుకుంది. కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా, తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ పాల్గొన్నారు.
అమర జవాన్ల త్యాగాలకు గుర్తుగా కార్గిల్ విజయ్ దివాస్ - kargil vijay diwas at vizag
కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరులకు నివాళిగా విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలు గర్వకారణమని ర్యాలీలో పాల్గొన్న ప్రముఖులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో నౌకాదళ సిబ్బంది, నగర ప్రజలు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
విశాఖలో కార్గిల్ విజయ్ దివస్