గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కరాటే నేర్చుకోవాలంటే..ఒకప్పుడు చాలా ఇబ్బంది. నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నా..నేర్పించే గురువులు లేక విద్యార్థులు కరాటే, కిక్ బాక్సింగ్‌కు దూరంగా ఉండేవారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం వేసవి సెలవుల్లో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది.
వేసవి సెలవుల్లో సరదాగా.. కరాటే శిక్షణ
విద్యార్థుల ఆలోచనలో వినూత్న మార్పులు వస్తున్నాయి. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టి...వేసవి సెలవులు వచ్చాయంటే సరదాగా గడిపేయాలని అనుకుంటుంటారు. వేసవిలో సరదాగా గడుపుతూనే సెలవుల్లో ఏదో ఒకటి నేర్చుకోవాలన్న తపన ఇప్పటి విద్యార్థుల్లో పెరుగుతోంది. ఇందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతులు బాగా ఉపయోగపడుతున్నాయి.
వేసవి సెలవుల్లో సరదాగా..కరాటే శిక్షణ
విశాఖ జిల్లా అనకాపల్లిలో వేసవి శిక్షణా తరగతులలో భాగంగా ఏర్పాటు చేసిన కరాటే, కిక్ బాక్సింగ్ కోచింగ్ సెంటర్లో విద్యార్థులు తర్ఫీదు పొందుతున్నారు. ఆత్మరక్షణ కోసం ఈ విద్యను నేర్చుకుంటున్నట్లు..విద్యార్దులు చెబుతున్నారు. కరాటే, కిక్ బాక్సింగ్ లో సాధన చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: సూరీడు భగభగ... మీటర్లు గిరగిర!