ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్థానిక సంగ్రామం: ఆ గ్రామంలో ఎన్నికల్లేవ్..ఎందుకంటే! - ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వార్తలు

పంచాయతీ ఎన్నికలు... వచ్చాయంటే చాలు ప్రతి ఊర్లో రాజకీయ పార్టీల కోలాహలమే. కానీ ఆ ఊర్లో పరిస్థితి మాత్రం వేరు. అభ్యర్థుల కోసం అన్వేషణ కాదు.. వారికి కావాల్సిందల్లా గ్రామ అభివృద్ధే. అందుకోసం వారు ఎంచుకున్న మార్గం ఏకగ్రీవ ఎన్నిక. 2006 నుంచి అదే తంతు! అంతేకాదు ఎన్నికల వల్ల ఖర్చులు.. విభేదాల తప్ప ఏమంటుదని ప్రశ్నిస్తారు అక్కడి గ్రామస్థులు.

kannampalem-village-unanimously-elected-gram-panchayat-in-vishkapatanm
kannampalem-village-unanimously-elected-gram-panchayat-in-vishkapatanm

By

Published : Mar 11, 2020, 2:48 PM IST

స్థానిక సంగ్రామం: ఆ గ్రామంలో ఎన్నికల్లేవ్..ఎందుకంటే!

విశాఖ జిల్లా చోడవరం మండలంలో కన్నంపాలెం గ్రామం... ఇక్కడ 2006 నుంచి పంచాయతీ ఎన్నికలు జరగటం లేదు​. కారణం.. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టకపోవడమే. ఎన్నికల నిర్వహణతో ఖర్చులు... విభేదాలు తప్ప ఏం ఉండవని గ్రహించిన ఆ గ్రామస్థులు... ఏకగ్రీవమే సరైన నిర్ణయం అనుకున్నారు. ఇలా ఒక్కసారి కాదు.. 2006 నుంచి సర్పంచి అభ్యర్థిని ఏకగ్రీవంగా ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ ఇచ్చే నజరానతో గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసుకుంటున్నారు.

కన్నంపాలెం పంచాయతీ 1995లో ఏర్పడింది. అంతకు ముందు చాకిపల్లి పంచాయతీలో ఉండేది. ఎన్నికల వల్ల కలిసొచ్చేదేమి లేదని వారంతా 2006 నుంచి పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నజరానాతో సిమెంట్ రహదారులు, కాలువలు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేశారు. గెలిచిన అభ్యర్థులు కూడా తమ సొంత నిధులతో ఆలయాలు నిర్మించారు. గ్రామాభివృద్ధి కోసం చిన్న, పెద్ద. యువత అందరూ ఐక్యమత్యంగా కలిసి ముందుకు సాగుతూ చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇదీ చదవండి :మున్సి 'పోల్స్': నామినేషన్ల దాఖలుకు నియమ నిబంధనలు

ABOUT THE AUTHOR

...view details