ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా విశాఖ కనక మహాలక్ష్మీ అమ్మవారి మాసోత్సవం - కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం

ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

kankamahalakshmi ammavari masotsvalu starts
కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం

By

Published : Nov 28, 2019, 8:20 AM IST

కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం
విశాఖవాసులు కొంగు బంగారం.. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సతీసమేతంగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. మార్గశిర మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. పసుపు నీళ్లతో అమ్మను అభిషేకించేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రజలు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details