ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు ఏర్పాట్లు - విశాఖపట్నంలో కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు వార్తలు

విశాఖలో ఈనెల 15 నుంచి వచ్చే నెల 13 వరకు కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు జరగనున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు అధికారులకు సూచించారు.

Kanakamahalakshmi Ammavari Margashira Masostavalu   in Visakhapatnam
విశాఖపట్నంలో కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు

By

Published : Dec 5, 2020, 12:57 PM IST

ఈ నెల 15 నుంచి వచ్చే నెల 13 వరకు విశాఖలో జరిగే కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని సమన్వయ కమిటీ సమావేశంలో విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్‌ (ఆసరా) ఆర్‌.గోవిందరావు అధికారులకు తెలిపారు. అనంతరం ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకొని .. స్లిప్పులు పట్టుకొని వచ్చిన వారిని మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తామని ఆలయ ఈఓఎస్. జె. మాధవి చెప్పారు. నగరంలోని అంబికాబాగ్‌ (జగదాంబ కూడలి దరి), జేఎన్‌. చౌల్ట్రీ, జగన్నాథస్వామి ఆలయం (మెయిన్‌రోడ్డు, కొత్తరోడ్డు దరి) వద్ద స్లాట్‌ స్లిప్పులు జారీ చేస్తామని తెలిపారు.

నో మాస్కు, నో స్లాట్‌, నో ఎంట్రీ పద్ధతిలో ఉత్సవాలు నిర్వహిస్తామని గోవిందరావు వివరించారు. సహాయ పోలీసు కమిషనర్లు ఎస్‌.శిరీషా, శరత్‌రాజ్‌కుమార్, దేవాదాయశాఖ ఉప కమిషనర్‌ సుజాత, ఇన్‌స్పెక్టర్లు ఎం.వెంకటనారాయణ, విద్యాసాగర్, సీఎంఓ డాక్టర్‌ కేఎస్‌ఎల్‌జీ శాస్త్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి.విశాఖలో ఎంఎస్‌ఎంఈ పార్కు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details