విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలో కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర అంబరాన్నంటింది. గ్రామీణ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పట్టణంలోని రాజీవ్ క్రీడామైదానంలో వేడుక నిర్వహించారు. జాతరలో భారీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. రంగుల రాట్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఉత్సవ కమిటీ భారీ ఏర్పాటు చేసింది.