ఈశాన్య రాష్ట్రం మిజోరం 15వ గవర్నర్గా కంభంపాటి హరిబాబు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్లోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గువాహటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మైఖేల్ జోథాన్ ఖుమా ఆయనతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. వాస్తవానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుదాంసుదులియా ప్రమాణం చేయించాల్సి ఉంది.
KAMBAMPATI: మిజోరం గవర్నర్గా కంభంపాటి హరిబాబు ప్రమాణస్వీకారం - మిజోరం గవర్నర్గా కంభంపాటి హరిబాబు ప్రమాణస్వీకారం
మిజోరం 15వ గవర్నర్గా కంభంపాటి హరిబాబు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్లోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గువాహటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మైఖేల్ జోథాన్ ఖుమా ఆయనతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.
![KAMBAMPATI: మిజోరం గవర్నర్గా కంభంపాటి హరిబాబు ప్రమాణస్వీకారం మిజోరం గవర్నర్గా కంభంపాటి హరిబాబు ప్రమాణస్వీకారం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12512125-853-12512125-1626727947035.jpg)
మిజోరం గవర్నర్గా కంభంపాటి హరిబాబు ప్రమాణస్వీకారం
అయితే ఆయన కుటుంబ సభ్యులు కరోనా బాధ పడుతున్న నేపథ్యంలో ఆబాధ్యతలను మిజోరం రాజధాని ఐజ్వాల్ ఉన్న న్యాయమూర్తి మైఖేల్ జోథాన్ ఖుమాకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో మిజోరం ముఖ్యమంత్రి జోరందంగా, మంత్రులు, అధికారులు, కంభంపాటి హరిబాబు సతీమణి జయశ్రీ, ఆయన కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: