ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 4, 2020, 1:40 PM IST

ETV Bharat / state

కళ్యాణపులోవ జలాశయం మరమ్మతు పనులను గుర్తించి జలవనరుల శాఖ సాంకేతిక విభాగం

రావికమతం మండలంలోని కళ్యాణపులోవ జలాశయానికి మరమ్మతు పనులను గుర్తించేందుకు జలవనరుల శాఖ సాంకేతిక విభాగం అధికారులు వచ్చారు. ప్రధాన విద్యుత్​ గేట్లు, గేట్లకు రంగులు, ప్రధాన కాలువలు విస్తరణ తదితర పనులను గుర్తించి నివేదిక తయారు చేశారు.

kalyanapulova reservoir repair works estimated by irigation department techincal team in visakha district
కళ్యాణపులోవ జలాశయాన్ని పరిశీలిస్తున్న జలవనరుల అధికారులు

విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణపులోవ జలాశయాన్ని జలవనరుల శాఖ సాంకేతిక విభాగం అధికారులు పరిశీలించారు. జలాశయానికి చేయవలసిన మరమ్మతులను గుర్తించారు. ప్రధానంగా విద్యుత్​ ఏర్పాటు గేట్ల మరమ్మతులు, ప్రధాన కాలువలు విస్తరణ, ప్రధాన గేట్​లకు రంగలు వేయడం తదితర పనులను గుర్తించి నివేదికలను తయారు చేశారు. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా... ప్రస్తుతం 445.5 అడుగుల మేర నీటిమట్టం ఉంది. రావికమతం, రోలుగుంట, మాకవరపాలెం తదితర మండలాల్లోని సమారు 5 వేల ఎకరాలు ఈ జలాశయంపై ఆధారపడి ఉన్నాయి. మరమ్మతుల కారణంగా ప్రస్తుతం 3 వేల ఎకరాలకు మించి సాగవడం లేదు. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ సాంకేతిక శాఖ డీఈ వెంకటేశ్వరరావు, నర్సీపట్నం డీఈ స్వామి నాయుడు తదితరులు జలాశయ పరిశీలనకు వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details