ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు విశాఖ జిల్లా రావికమతం మండలం కల్యాణపులోవ జలాశయంలో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. మరో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. జలాశయం వద్ద మొత్తం నాలుగు గేట్లను ఎత్తి... అదనపు నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నట్లు అధికారులు తెలియజేశారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా... ప్రస్తుతం 459.5 అడుగుల నీటిమట్టం ఉంది. మొత్తం నాలుగు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కల్యాణపులోవ జలాశయం నాలుగు గేట్లు ఎత్తి నీటి విడుదల - visakha district Kalyanapulova Reservoir
విశాఖ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు రావికమతం మండలం కల్యాణపులోవ జలాశయం గేట్లెత్తి నీటిని దిగువకు వదిలారు. మొత్తం నాలుగు గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు.
కల్యాణపులోవ జలాశయం నాలుగు గేట్లు ఎత్తి నీటి విడుదల