విశాఖ జిల్లా రావికమతం మండలంలోని కల్యాణలోవ జలాశయం గేట్ల ఎత్తివేత కొనసాగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ వరద కొనసాగుతుండటం వల్ల అధికారులు గేట్లు ఎత్తారు. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా ప్రస్తుతం 385 అడుగులు ఉంది. ఈ స్థాయి మరింత పెరగకుండా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రెండు గేట్ల ద్వారా నీరు బయటకు పంపిస్తున్నారు. రోలుగుంట, మాకవరపాలెం మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
కల్యాణలోవ జలాశయం నుంచి దిగువకు నీరు విడుదల - కల్యాణలోవ జలాశయం గేట్లు ఎత్తివేత
విశాఖ జిల్లా రావికమతం మండలంలోని కల్యాణలోవ జలాశయం గేట్ల ఎత్తివేత కొనసాగుతోంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా ప్రస్తుతం 385 అడుగులు ఉంది.
కల్యాణలోవ జలాశయం నుంచి దిగువకు నీరు విడుదల