ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నిండుకుండల్లా జలాశయాలు.. పర్యవేక్షిస్తున్న అధికారులు

By

Published : Oct 9, 2020, 6:50 PM IST

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్​లోని పలు జలాశయాలు పూర్తిస్థాయిలో నిండాయి. అప్రమత్తమైన అధికారులు...ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు.

kalyana lova and tandava reservoirs reached full water level in vishakha district
జలాశయాలకు జలకళ.. పర్యవేక్షిస్తున్న అధికారులు

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్​లోని జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. నాతవరం మండలంలోని తాండవ జలాశయం, రావికమతం మండలంలోని కల్యాణపులోవ జలాశయాల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. ఫలితంగా జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టుల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

కల్యాణలోవ జలాశయం

కల్యాణలోవ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 420 అడుగులు కాగా.. ప్రస్తుతం 459.5 అడుగుల వద్ద నీటిని అధికారులు కొనసాగిస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని రోజు సాయంకాలం గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు.

తాండవ జలాశయం

తాండవ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా... ప్రస్తుతం 379.6 అడుగుల వద్ద ఉంది. ప్రాజెక్టులోకి అదనంగా చేరుతున్న వర్షపు నీటిని రోజు సాయంత్ర సమయంలో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే పరిసర ఆయా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

ఇదీ చూడండి:

గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

ABOUT THE AUTHOR

...view details