విశాఖ జిల్లా జుత్తాడ హత్యాకాండలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తన కుటుంబ సభ్యులను దారుణంగా హతమార్చిన ఘటనలో మొత్తం ఏడుగురి హస్తం ఉందని బాధితుడు విజయ్ ఆరోపించారు. ఈ మేరకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మంత్రి అవంతి శ్రీనివాసరావు, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ధన ప్రభావంతో నిందితుడు వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుంటున్నాడని ఆరోపించారు.
ఇదీ చదవండి:'చేతులు జోడించి అడుగుతున్నా.. పోలింగ్ కుదించండి'