ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ విశాఖలో జూనియర్ డాక్టర్లు ఆందోళనను కొనసాగించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుండగా మెరుపు ధర్నాకు దిగారు. కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్లే మార్గంలో రోడ్డుపై బైఠాయించారు. కేంద్రం తీరుపై నిరసన తెలిపారు. బిల్లును నిలుపుదల చేసే వరకు ఆందోళన విరమించేది లేదని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
''ఎన్ఎంసీ బిల్లును కేంద్రం వెనక్కు తీసుకోవాల్సిందే'' - nmc bill
కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ జూనియర్ వైద్యులు నిరసనకు దిగారు. విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్లే మార్గంలో రోడ్డుపై బైఠాయించారు.
జూనియర్ డాక్టర్లు