Custody Extension: దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల కస్టడీని ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది. నలుగురు నిందితులు శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లి జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో వారిని న్యాయస్థానంలో హాజరుపర్చగా.. 14 రోజుల కస్టడీ పొడిగించింది. అనంతరం కేసు విచారణను ప్రత్యేక న్యాయస్థానం జనవరి 2కు వాయిదా వేసింది. బినయ్ బాబు బెయిల్ పిటిషన్‌పై ఈడీ నివేదిక సమర్పించగా.. జనవరి 9కి వాయిదా వేసింది. అభిషేక్, విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ల విచారణ జనవరి 4కు వాయిదా వేసింది.
దిల్లీ మద్యం స్కామ్ కేసు నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు - దిల్లీ మద్యం స్కామ్ కేసు
Custody Extension: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల కస్టడీ ముగియడంతో వారిని న్యాయస్థానంలో హాజరుపర్చగా.. ప్రత్యేక న్యాయస్థానం కస్టడీ పొడిగించింది. అదే విధంగా కేసు విచారణను ప్రత్యేక న్యాయస్థానం జనవరి 2కు వాయిదా వేసింది.
మద్యం స్కామ్