రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ.... ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సంయుక్తంగా విశాఖపట్నంలో ఆందోళన నిర్వహించాయి.
'అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిథ్యం ఇవ్వాలి' - vizag news today
విశాఖలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్లు ఆందోళన నిర్వహించాయి. అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిథ్యం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు స్థలం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి.
అక్రిడేషన్ కమిటీలో ఇప్పటివరకు జర్నలిస్ట్ యూనియన్లకు స్థానం కల్పించిన ప్రభుత్వం... ఇప్పుడు అధికారులను మాత్రమే కమిటీలో చేర్చడం సమంజసం కాదని అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల చిన్న చిన్న పత్రికల్లో పనిచేస్తున్న పాత్రికేయులకు నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు 200 గజాల స్థలం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి.