పాత్రికేయుల హక్కుల దినోత్సవం సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం పిలుపు మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించారు. పాత్రికేయుల భద్రతకు ముప్పు చేకూర్చే చట్టాలను ఉపసంహరించుకోవాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు.
పాత్రికేయుల హక్కులను హరిస్తూ కేంద్రం రద్దు చేసిన చట్టాలను పునరుద్ధరించాలని కోరారు. కేంద్రం తాజాగా 4 ప్రొసీజర్ కోడ్ లను తెచ్చేందుకు కార్మికులకు, పాత్రికేయులకు ఉపకరించే చట్టాలను రద్దు చేసిందని శ్రీను బాబు ఆవేదన వ్యక్తం చేశారు