ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Chennai NGT: సింహాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పర్యావరణ ఉల్లంఘనలపై సంయుక్త కమిటీ - జాతీయ హరిత ట్రైబ్యునల్ తాజా వార్తలు

ఎన్‌టీపీసీ సింహాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తోందంటూ (NTPC Violations of Environmental Regulations) దాఖలైన పిటిషన్‌పై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ చెన్నై ధర్మాసనం సంయుక్త కమిటీని నియమించింది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి, విశాఖ జిల్లా కలెక్టర్‌లతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది.

Chennai NGT
Chennai NGT

By

Published : Nov 23, 2021, 10:32 PM IST

ఎన్‌టీపీసీ సింహాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తోందంటూ దాఖలైన పిటిషన్‌పై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ చెన్నై ధర్మాసనం సంయుక్త కమిటీని (Joint Committee on NTPC simhadri thermal power plant) నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ఉల్లంఘనల కారణంగా..గాలి, నీరు, మట్టి కాలుష్యం అవుతున్నాయని విశాఖ జిల్లా పిట్టవానిపాలెంకు చెందిన బట్టు సతీష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ రామకృష్ణన్, సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ మేరకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి, విశాఖ జిల్లా కలెక్టర్‌లతో సంయుక్త కమిటీని నియమించింది.

పర్యావరణ అనుమతి, గాలి, నీరు, నేల కాలుష్యం, వ్యవసాయానికి కలిగిని నష్టం, సీఎస్‌ఆర్‌ నిధుల అమలు తదితర అంశాలపై వచ్చిన ఆరోపణలపై జిల్లా కలెక్టర్‌ వ్యక్తిగతంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని పరిశీలించి నివేదిక దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణలోగా కనీసం మధ్యంతర నివేదిక అయినా..ఇవ్వాలని కోరింది. పర్యావరణం, వ్యవసాయానికి జరిగిన నష్టానికి పరిహారం అంచనా వేయాలని సంయుక్త కమిటీని ఆదేశించింది. కౌంటరు దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని ఏపీపీసీబీ ధర్మాసనాన్ని కోరగా.. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 7కు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details