ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్రాలు 56... అభ్యర్థులు 15,755 - viskha jc review on polycet

పాలిటెక్నిక్‌ ప్రవేశాల ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఈనెల 27వ తేదీన సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

joint collector Review on Policet Arrangements in visakha
పాలిసెట్‌ ఏర్పాట్లపై జేసీ సమీక్ష

By

Published : Sep 25, 2020, 9:29 AM IST

ఈ నెల 27వ తేదీన జరగనున్న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్)ను సజావుగా నిర్వహించాలని విశాఖ సంయుక్త కలెక్టర్ ఏన్. వేణుగోపాల్ రెడ్డి అధికారులను కోరారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో పాలీసెట్ నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జిల్లాలో మొత్తం 56 పరీక్ష కేంద్రాల్లో 15వేల 755 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. రెవెన్యూ, పోలీసు, విద్యా శాఖల అధికారుల బృందాలు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్లుగా పర్యవేక్షిస్తారని వేణుగోపాల్ రెడ్డి వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద శానిటైజేషన్ చేయాలని.... తాగునీటి సౌకర్యం కల్పించాలని జీహెచ్​ఎంసీ, పంచాయతీ అధికారులను కోరారు.

పరీక్షా కేంద్రాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఈపీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు, తిరిగి వెళ్లేందుకుగాను ఆదివారం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు తెలిపారు.

ఇదీ చదవండి:ఆర్టీసీకి పెరుగుతున్న ప్రయాణికులు...

ABOUT THE AUTHOR

...view details