విశాఖపట్నంలోని ఏపీ మెడ్ టెక్ జోన్ వ్యవహారంలో ఇంకా మార్పు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. మెడ్ టెక్ జోన్ ఎండీ-సీఈఓగా ఇటీవలే తిరిగి నియమించిన జితేంద్ర శర్మ హోదాలో మార్పు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను మెడ్ టెక్ జోన్‌కు సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు ఇచ్చారు. మెడ్ టెక్ జోన్ వ్యవహారంలో విచారణ పూర్తి అయ్యేంత వరకూ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ భార్గవకు ఎండీ-సీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ మెడ్‌టెక్ జోన్ సలహాదారుగా జితేంద్ర శర్మ... ఉత్తర్వులు జారీ - AP Med Tech Zone Latest News in telugu
విశాఖలోని ఏపీ మెడ్ టెక్ జోన్ ఎండీ-సీఈఓగా జితేంద్రశర్మ హోదాలో మార్పు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను మెడ్ టెక్ జోన్‌కు సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ మెడ్ టెక్ జోన్ సలహదారుగా జితేంద్ర శర్మ... ఉత్తర్వులు జారీ