ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఝార్ఖండ్​లో జీసీసీ ఉత్పత్తుల విక్రయానికి గ్రీన్​సిగ్నల్ - Jharkhand

ఝార్ఖండ్ మార్కెటింగ్ కోపరేటివ్ ఫెడరేషన్... గిరిజన కోపరేటివ్ కార్పోరేషన్​ల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రెండు సంస్ధల ఉత్పత్తులు ఝార్ఖండ్, ఏపీలో అమ్మే అంశంపై అధికారులు చర్చించారు.

ఝార్ఖండ్​లో జీసీసీ ఉత్పత్తుల విక్రయానికి గ్రీన్​సిగ్నల్

By

Published : Jun 22, 2019, 11:42 PM IST

విశాఖలోని గిరిజన కో-ఆపరేటివ్ కార్పోరేషన్ (జీసీసీ) కార్యాలయాన్ని ఝార్ఖండ్ ప్రతినిధులు సందర్శించారు. జీసీసీ ఎండీతో ఝార్ఖండ్ మార్కెటింగ్ కోపరేటివ్ ఫెడరేషన్ ఎండీ భేటీ అయ్యారు. 2 సంస్ధల మధ్య ఐదు అంశాలపై ఒప్పందాలు జరిగాయి. రెండు సంస్ధల ఉత్పత్తులు ఝార్ఖండ్, ఏపీలో అమ్మేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. ఝార్ఖండ్‌ కరంజి తేనెను జీసీసీ ద్వారా అమ్మేందుకు ఒప్పందం జరిగింది. ఝార్ఖండ్ చిరంజి గింజలను ఏపీలో విక్రయించేందుకు జీసీసీ అంగీకారం తెలిపింది. రాంచీలో అరకు కాఫీ విక్రయానికి ఒప్పందం చేసుకున్న అధికారులు... ఝార్ఖండ్ ఉత్పత్తుల విలువ పెంచేలా ప్యాకింగ్, బ్రాండింగ్‌లో జీసీసీ సహకారంపై చర్చించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details