పోక చెక్కపై శివలింగం.. చుట్టూ వెండిలోహ సర్పం Micro Shiva Lingam: పసిడి వెండి లోహాలతో ఇప్పటికే అనేక సూక్ష్మ ఆకృతుల తయారీతో గుర్తింపు పొందిన విశాఖ జిల్లా రోలుగుంటకు చెందిన శ్రీనివాసరావు మరో సూక్ష్మ ఆకృతికి శ్రీకారం చుట్టారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని... బంగారం వెండి లోహాలతో అద్భుత ఆకృతులను తయారు చేశారు. అతితక్కువ పరిమాణాలతో శివపార్వతులు, తాజ్‌మహల్, ఈఫిల్ టవర్, సైకిల్, ఫ్యాన్లు, 12 జ్యోతిర్లింగాలు, వినాయకుడు తదితర ఆకృతులను రూపొందించారు.
పోక చెక్కపై శివలింగం..
తాజాగా కేవలం రెండు రోజుల వ్యవధిలో పోక చెక్కపై శివలింగాన్ని రూపొందించడమే గాక ఆ లింగానికి చుట్టూ వెండి లోహ సర్పం ఆకృతిని తయారు చేశారు. విభూతి రేఖలు ఓంకారం మూడు మిల్లీమీటర్ల పరిమాణంతో శివలింగాన్ని చుట్టుకొని ఉన్నట్టు చక్కని స్వరూపాన్ని రూపొందించాడు. అలాగే శ్రీశైలం దేవస్థానంలోని నమూనా మాదిరిగా శివగోపురాన్ని రెండు సెంటీమీటర్ల పరిమాణంతో తయారు చేశాడు. త్వరలోనే ప్రపంచంలోని ఏడు వింతలను పసిడి వెండి లోహాలతో తయారు చేసే ఆలోచన ఉందని... వాటి కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్టు శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చదవండి:
YS Viveka Murder Case: వివేకా హత్యకు పథక రచన సీఎందేనేమో..!