రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. విశాఖపట్నం జిల్లా యస్. రాయవరంలో యువకులు నిర్మించిన రక్షిత శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభించారు. యస్.రాయవరం గ్రామం గురజాడ అప్పారావు నడయాడిన నేలని, అలాంటి గ్రామంలో పర్యటించడం తన అదృష్టమని తెలిపారు. యువత సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా యువత సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వ్యసనాలకు దూరంగా ఉండి, సత్ప్రవర్తనతో మెలగాలని కోరారు. సరైన లక్ష్యం దిశగా యువత ముందుకెళ్లాలని చెప్పారు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలి - s.rayavaram
విశాఖపట్నం జిల్లా యస్. రాయవరంలో రక్షిత శుద్ధ జల కేంద్రాన్ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి జరగాలన్నారు.
![రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3966428-841-3966428-1564250677775.jpg)
యస్. రాయవరంలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ పర్యటన