దిల్లీలో నిరసన చేపట్టిన అన్నదాతలకు మద్దతుగా విశాఖలో కాంగ్రెస్ నేతలు చేపట్టి నిరసనకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంఘీభావం తెలిపారు. మద్దిలపాలెం జాతీయ రహదారి పై ఆయన ప్రయాణిస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు అడ్డగించి మద్దతు ఇవ్వమని కోరగా... ఆయన సంఘీభావం ప్రకటించారు. దేశంలో రైతు బాగుండాలని, కేంద్రం మరో సారి ఈ బిల్లు పై చర్చించాలని అన్నారు. అన్నదాతల ఆవేదనను అర్ధం చేసుకోవాలని కోరారు.
'కేంద్రం మరోసారి ఈ బిల్లుపై చర్చించాలి' - జెడి లక్ష్మీనారాయణ తాజా సమాచారం
వ్యవసాయ బిల్లులపై కేంద్రం మరో సారి చర్చించాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ విశాఖలో కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసనకు లక్ష్మీనారాయణ సంఘీభావం ప్రకటించారు. దిల్లీలో కర్షక ఉద్యమం గొప్పదని, ఇప్పుడు రాజకీయ ఉద్యమంగా మారినా.. అక్కడి రైతుల ఆవేదనను అర్ధం చేసుకోవాలని అన్నారు.
విశాఖ నిరసనకారులకు సంఘీభావం తెలిపిన జెడి లక్ష్మీనారాయణ