రాష్ట్ర ప్రజలుఆశిస్తున్న మార్పు జనసేనతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థిసీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. తాను విశాఖ నియోజకవర్గ ప్రజలకు ఇవ్వనున్న హామీలు నెరవేరుస్తానని బాండు పత్రంపై రాసి ఇస్తానని... అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తానని స్పష్టం చేశారు. తాను ఎన్నికల్లో గెలిస్తే ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని లక్ష్మీనారాయణ అన్నారు. పలువురు జనసేన కార్యకర్తలు ఆయన వెంట రాగా పాదయాత్రగా వెళ్లి విశాఖ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ఆయన సంపత్ వినాయక అలయంలో పూజల నిర్వహించారు.