రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా విశాఖ గ్రామీణ జిల్లాకు సంబంధించిన రెండు వేల పడకల క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని... సంయుక్త పాలనాధికారి ఆర్.గోవిందరావు తెలిపారు. శనివారం సాయంత్రం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాలను ఆయన సందర్శించారు. నూతనంగా ఏర్పాటు చేయబోయే ఈ కేంద్రాల్లో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
కొత్తగా ఏర్పాటు చేస్తున్న క్వారంటైన్ కేంద్రాలను పరిశీలించిన జేసీ - Quarantine Centers latest news update
విశాఖ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న క్వారంటైన్ కేంద్రాలను జేసీ గోవిందరావు పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు.
కొత్తగా ఏర్పాటు చేస్తున్న క్వారంటైన్ కేంద్రాలను పరిశీలించిన జేసీ