విశాఖ ఏజెన్సీ హుకుంపేట మండలంలో మారుమూల కుగ్రామం జర్రకొండ. గ్రామాన్ని చేరుకోవడానికి మార్గం సహా మౌలిక వసతులు లేక కొట్టుమిట్టాడుతోంది. కరోనా నిత్యావసరాల పంపిణీకీ అతి కష్టం మీద ఎమ్మెల్యే ఫాల్గుణ కుమారుడు వినయ్ బృందం చేరుకుంది. వారికి తమ గ్రామ అవస్థలను కన్నీటి పర్యంతమై వివరించింది గ్రామ వాలంటీర్ ఈశ్వరమ్మ. సకాలంలో వైద్య సేవలు అందక గ్రామంలో చాలా మంది మృత్యువాత పడుతున్నారని తెలిపింది. తల్లిదండ్రులు లేని పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని వాపోయింది. ఈ కరోనా కాలంలో పాలు సైతం దొరకక చంటి పిల్లలు అల్లాడుతున్నారని చెప్పింది.
సార్ మా సమస్యలు పరిష్కరించండి..ఎమ్మెల్యే కుమారుడికి మొర - no basic infrastructure for jarrakonda village
తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కుమారుడికి గ్రామ వాలంటీర్ తమ సమస్యలు మొరపెట్టుకుంది. సమస్యలు విన్న నాయకులు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
![సార్ మా సమస్యలు పరిష్కరించండి..ఎమ్మెల్యే కుమారుడికి మొర Jarrakonda grama volunteer explains about village problems to son of MLA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7269677-281-7269677-1589951484550.jpg)
జర్రకొండ గ్రామస్థుల అవస్థలు ఎమ్మెల్యే కుమారుడికి విన్నవించిన గ్రామవాలంటీర్
గ్రామంలో రహదారి పాఠశాల, అంగన్వాడి భవనం, పంచాయితీ కేంద్రం, కమ్యూనిటీ ఆరోగ్య భవనం ఏమీ లేవని కన్నీరు పెట్టుకుంది. అతి కష్టం మీద వచ్చిన మీరే ఎలా అయినా ఆదుకోవాలని వేడుకుంది. ఈశ్వరమ్మ మాటలు విన్న వారు చలించిపోయారు. వెంటనే అధికారులకు నివేదిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: 'వైద్యుడు సుధాకర్‌కు ప్రాణహాని ఉంది'