ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోడవరం మండలంలో సచివాలయ, పంచాయతీ భవనాలు ప్రారంభం - జన్నవరం సచివాలయ భవనాన్ని ప్రారంభించిన కలెక్టర్ వినయ్ చంద్

జన్నవరం సచివాలయం, సింహాద్రిపురం పంచాయతీ భవనాల ప్రారంభోత్సవంలో.. విశాఖ కలెక్టర్ వినయ్ చంద్​తో పాటు అనకాపల్లి ఎంపీ సత్యవతి, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. సచివాలయ వ్యవస్థ ఆవశ్యకత, విశిష్టతను ప్రజలకు వివరించారు.

sachivalayam panchayat buildings inauguration
ప్రారంభోత్సవంలో పాల్గొన్న కలెక్టర్, ప్రజాప్రతినిధులు

By

Published : Dec 11, 2020, 7:18 PM IST

విశాఖ జిల్లా చోడవరం మండలం జన్నవరం గ్రామ సచివాలయం, సింహాద్రిపురం పంచాయతీ కార్యాలయ భవనాలను కలెక్టర్ వినయ్ చంద్ ప్రారంభించారు. సచివాలయ వ్యవస్థ ఎందుకు, ఎలా ఏర్పడింది అనే అంశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డా. బి.సత్యవతి, స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు.

సచివాలయాల ఆవశ్యకత, విశిష్టతను సత్యవతి ప్రజలకు వివరించారు. ఈ వ్యవస్థ ఏర్పాటుతో.. దేశవ్యాప్తంగా రాష్టానికి గుర్తింపు వచ్చిందని తెలిపారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులను.. ఆయా గ్రామాల్లో ఊరేగింపుగా వైకాపా కార్యకర్తలు ప్రారంభోత్సవానికి తీసుకువెళ్లారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details