అనకాపల్లిలో జనతా కర్ఫ్యూ
అనకాపల్లిలో జనతా కర్ఫ్యూ... ఖాళీగా దర్శనమిచ్చిన రోడ్లు - anakappali news
విశాఖ జిల్లా అనకాపల్లిలో ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటించారు. ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలను పాటించారు.

అనకాపల్లిలో జనతా కర్ఫ్యూ
జనతా కర్ఫ్యూ నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు... విశాఖ జిల్లా అనకాపల్లిలో ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించారు. దీంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లు ప్రయాణికులు లేక ఖాళీగా దర్శనమిచ్చాయి.