ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆదుకోవాల్సింది పోయి.. అధిక బిల్లులు వసూలు చేస్తారా?' - electricity bills latest news update

ప్రభుత్వం అధిక విద్యుత్​ బిల్లులను వసూలు చేస్తోందని ఆరోపిస్తూ విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు అందోళన చేపట్టారు.

Janasena request latter
విద్యుత్​ బిల్లులపై జనసేన వినతిపత్రం

By

Published : May 11, 2020, 2:18 PM IST

కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఊరట కల్పించాల్సిన ప్రభుత్వం.. అధిక మొత్తంలో విద్యుత్ బిల్లులను వసూలు చేస్తోందని జనసేన నేతలు ఆగ్రహించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు.. అందోళన చేపట్టారు.

స్థానిక విద్యుత్ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. బిల్లుల వసూలులో ప్రభుత్వ మార్గదర్శకాలు అమలు చేస్తామని అధికారులు వారికి చెప్పారు. ప్రజలకు ఇబ్బంది రాకుండా చూస్తామని స్పష్టం చేశారు. ఏమైనా సందేహాలు ఉంటే ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.

ABOUT THE AUTHOR

...view details