ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంగన్​వాడీ పోస్టుల భర్తీలో అవకతవకలపై జనసేన ఆందోళన - అంగన్ వాడీ పోస్టుల భర్తీపై విచారణ కోసం నర్సీపట్నం జనసేన డిమాండ్

విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ పరిధిలో ఇటీవల జరిగిన అంగన్​వాడీ పోస్టుల భర్తీ వివాదాస్పదమైంది. అభ్యర్థులను తీసుకునే విషయంలో పలు అవకతవకలు చోటు చేసుకున్నాయని జనసేన నాయకులు ఆరోపించారు. సబ్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు.

janasena protests in narsipatnam
నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన నేతలు

By

Published : Nov 3, 2020, 6:06 PM IST

అంగన్​వాడీ పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలంటూ విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్​ కలెక్టరేట్ వద్ద జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనతో ప్రమేయమున్న రాజకీయ నేతలపై చర్యలు తీసుకోవాలని.. రాజన్న సూర్యచంద్ర అధ్యక్షతన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సబ్ కలెక్టర్​కు వినతి పత్రాన్ని అందజేసి.. అవకాశం కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details